: ఏసీబీకి చిక్కిన లంచగొండి ఏఈ


పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి విద్యుత్ శాఖ ఏఈ ఆలమదాసు వెంకటేశ్వరరావు ఏసీబీ వలలో చిక్కారు. వ్యవసాయ కనెక్షన్ ఇచ్చేందుకు స్థానిక రైతు నుంచి 8 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు వెంకటేశ్వరరావును వల వేసి పట్టుకున్నారు. గత కొంత కాలంగా వ్యవసాయ కనెక్షన్ అడుగుతున్న రైతును... లంచం ఇస్తేనే కనెక్షన్ అంటూ ఏఈ ఇబ్బంది పెడుతుండటంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో విద్యుత్ శాఖ ఏఈ అడ్డంగా బుక్కయిపోయాడు.

  • Loading...

More Telugu News