: అఖిలపక్ష సమావేశం కంటి తుడుపు చర్యే: కిషన్ రెడ్డి
రాష్ట్ర పార్టీలతో జీవోఎం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కంటి తుడుపు చర్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. జీవోఎం కోరిన 11 అంశాలపై కేంద్రం వద్దే ఎలాంటి ప్రతిపాదనలు లేవని చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెడితే బేషరతుగా మద్దతు ఇస్తామని జీవోఎంకు స్పష్టం చేశామన్నారు. కాగా, నేరాలపై సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు శిక్షార్హమైనవన్నారు.