: కేసీఆర్ కి అది అలవాటే: మందకృష్ణ
రహస్య ఒప్పందాలు చేసుకోవడం కేసీఆర్ కు అలవాటేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, కేంద్రం హైదరాబాద్ పై ఆంక్షలు విధిస్తే కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావుల కోసం కేసీఆర్ ఒప్పుకుంటారని విమర్శించారు. ప్యాకేజీ కోసం తెలంగాణపై ఆంక్షలకు కేసీఆర్ అంగీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో... ఆయా అంశాలపై తెలంగాణ ప్రజలకు ఆయన వెంటనే వివరణ ఇవ్వాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. సీఎం పదవిస్తే చాలు ఎటువంటి ఆంక్షలు విధించినా ఒప్పుకుంటామనే రీతిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.