: ప్రధానితో పాక్ ప్రధానమంత్రి సలహాదారు భేటీ
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో పాకిస్ధాన్ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వీరు చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే నిన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తోనూ ఆయన సమావేశమయ్యారు. ఢిల్లీలో రెండురోజుల పాటు (నవంబర్ 11, 12) జరిగిన 11వ ఆసియా-యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రుల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనడం కోసం అజీజ్ ఢిల్లీ వచ్చారు.