: మోడీ సభకు డ్రోన్ విమానాలతో పహారా


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న ఇంటలిజెన్స్ రిపోర్టుతో పోలీసు వ్యవస్థ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 న బెంగళూరులో జరగనున్న మోడీ ర్యాలీకి... కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తగు భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. మోడీకి వీవీఐపీ స్థాయి భద్రతను కల్పించాలని నిర్ణయించింది. 3 లక్షల మందికి పైగా ఈ ర్యాలీకి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ ర్యాలీకి 5 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

ర్యాలీ సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని... కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో, లక్షలాది మంది హాజరయ్యే సభలో ప్రతి ఒక్కరి కదలికలను క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యపడదని పోలీసు అధికారులు భావించారు. సీసీ కెమెరాలతో కూడా పెద్దగా ఫలితం ఉండదని వీరు భావిస్తున్నారు. దీంతో, రెండు పైలట్ రహిత డ్రోన్ విమానాలను రంగంలోకి దించాలని నిర్ణయించారు. హై రెసొల్యూషన్ కెమెరాలను కలిగిన డ్రోన్ లు రియల్ టైం పిక్చర్స్ ను కంట్రోల్ రూంకు పంపిస్తాయి. వీటిని వెంటనే సభాస్థలంలో ఉండే పోలీసు ఉన్నతాధికారులకు చేరవేస్తారు. దీంతో, సభాస్థలంలో ప్రతి ఒక్కరి కదలికలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించే అవకాశం ఉంటుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఈ డ్రోన్ లను ఓ ప్రైవేట్ ఏజన్సీ నుంచి అద్దెకు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News