: హైదరాబాద్ లో పెరుగుతున్న చలి


రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. శీతాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు క్రమేణా తగ్గిపోతుండడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరగగా హైదరాబాద్ లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో 13 డిగ్రీల కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి రాష్ట్రానికి చల్లని పొడిగాలులు వీస్తుండడంతో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. పొగ మంచు కారణంగా నాలుగు విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేశారు.

  • Loading...

More Telugu News