: బ్లాక్ టీ తాగండి ... గుండెపోటుకి దూరంగా వుండండి!
మీ గుండె భద్రంగా వుండాలని కోరుకుంటున్నారా ... అయితే రోజూ మూడు కప్పుల బ్లాక్ టీ సేవించండి. ఇది మేము చెబుతున్న ఆరోగ్య సూత్రం కాదు ... పరిశోధనలు చేసి మరీ వైద్యులు ఇస్తున్న సలహా ఇది. బ్లాక్ టీలో సమృద్ధిగా వుండే యాంటీ ఆక్సిడెంట్లు మన గుండెలోని రక్తకణాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. దీని వల్ల గుండె భద్రంగా వుండి, జబ్బు రానివ్వకుండా కాపాడుతుంది.
ఇంకా ప్రయోజనం ఏమిటంటే, బ్లాక్ టీ తాగడం వల్ల బీపీ (రక్తపోటు) కూడా అదుపులో వుంటుందట. రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. టైప్ 2 మధుమేహం (డయాబిటిస్) కూడా అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు . మరి ఇన్ని ప్రయోజనాలు వున్నప్పుడు ... మరేమీ ఆలోచించకుండా రోజూ మూడు కప్పుల గరం గరం బ్లాక్ టీ లాగించేయండి!