: నూజివీడులో తులసి సీడ్స్ ఉద్యోగులను నిర్బంధించిన రైతులు
విత్తన బకాయిలు చెల్లించనందుకు కృష్ణా జిల్లా నూజివీడులో తులసి సీడ్స్ కంపెనీకి చెందిన 15 మంది ఉద్యోగులను రైతులు నిర్బంధించారు. పత్తి, విత్తనాల బకాయిల కింద రూ.30 కోట్లు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.