: నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న జగన్


వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రాజమండ్రిలో జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాల వేసి... అనంతరం జక్కంపూడి కుటుంబసభ్యులతో మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు కాకినాడలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుని వివాహానికి హాజరవుతారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళతారు. రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి గౌతమి ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ తిరిగి వస్తారు.

  • Loading...

More Telugu News