: గిన్నిస్ బుక్ రికార్డును సాధించిన బాలిక కిడ్నాప్


విజయవాడలో నిన్న ఆరో తరగతి బాలిక కిడ్నాప్ కు గురయింది. ఈ ఘటన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రామలింగేశ్వర నగర్ ఆరో లైన్ లో ఉండే కాంగ్రెస్ నాయకుడు బోను దుర్గానరేష్ కుమార్తె నందిని పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి 8.30 గంటల వరకు వేచి చూసిన కుటుంబసభ్యులు నందిని రాకపోవడంతో... చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రాత్రి 7 గంటల సమయంలో స్కూలు బస్సు దిగిందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. తమపై ఎవరికీ శతృత్వం లేదని నందిని తండ్రి చెబుతున్నారు. 2010లో హైదరాబాద్ గచ్చిబౌలిలో కూచిపూడి నాట్య ప్రదర్శన ఇచ్చిన నందిని... అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా గిన్నిస్ బుక్ అవార్డు అందుకుంది.

  • Loading...

More Telugu News