: రేపు సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం
రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ క్యాబినెట్ భేటీలో ప్రధానంగా బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తే ప్రతిపక్షాలను నిలువరించవచ్చన్న దానిపైనే చర్చించనున్నారు. ఈ నెల13 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక విద్యుత్ కొరత, శాంతి భద్రతల అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. దాదాపు మూడు నెలల తర్వాత క్యాబినెట్ భేటీ కానుంది.