: బీపీ రోగులకు శుభవార్త


బీపీ రోగులకు ఒక శుభవార్త. అధిక రక్తపోటును నియంత్రించడానికి శాస్త్రవేత్తలు ఒక సరికొత్త చికిత్సా విధానాన్ని రూపొందించారు. దీనివల్ల రోగుల ప్రాణాలను కాపాడడమే కాదు, జీవన ప్రమాణాలను కూడా పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు రక్తపోటును నివారించే సరికొత్త చికిత్సా విధానాన్ని రూపొందించారు. మూడేళ్లపాటు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించి ఈ సరికొత్త చికిత్సా విధానాన్ని రూపొందించారు. ఆస్ట్రేలియా, యూరప్‌లలో ఈ విధానంపై శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. చికిత్సకు లొంగని స్థాయిలో రక్తపోటు ఉన్న రోగులకు ఆరు నెలలపాటు ఈ కొత్త చికిత్సా విధానంలో వైద్యం చేశామని, తర్వాత మూడేళ్లపాటు వారి రక్తపోటు అదుపులో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ కొత్త చికిత్సా విధానాన్ని పెర్క్యుటేనియస్‌ రీనల్‌ సింపథిటిక్‌ డినర్వేషన్‌ అంటారు. దీనిప్రకారం మెదడుకు సిగ్నల్స్‌ పంపే నరాలు కిడ్నీల చుట్టూ ఉంటాయి. రక్తపోటును పెంచేవి కూడా కిడ్నీలే. కిడ్నీలనుండి మెదడుకు సంకేతాలు పంపకుండా వాటి మధ్యనున్న నరాలను నిర్వీర్యం చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ విధానంలో స్వల్ప, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ ఉండవని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విధానంలో లోకల్‌ అనస్థీషియా ఇస్తారు. నిర్దిష్ట నరంపై రేడియో ఎనర్జీ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తారు. దీంతో కిడ్నీలకు రక్తాన్ని పంపే నరం నిర్వీర్యం అయిపోతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News