: ట్వీటిచ్చేముందు కాస్త ఆలోచించండి


మన మనసులోని భావాలను, భావోద్వేగాలను పంచుకోవడానికి ఎక్కువగా స్నేహితుల వద్ద వాలుతాం. కానీ ఇప్పుడు దూరంగా ఉన్న స్నేహితులను కూడా చక్కగా కలిపే వేదిక ఇంటర్నెట్‌. ఇందులో ట్విట్టర్‌నే ప్రధానంగా భావోద్వేగాలను పంచుకోవడానికి ఎక్కువమంది వాడుతున్నారు. ఇతర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు ఎన్ని వచ్చినా ఆధునిక యువత మాత్రం ట్విట్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందట. ఇందులో ఎక్కువమంది అమ్మాయిలు తమ మనసులోని భావాలను పంచుకోవడానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకుంటున్నారట. మనలోని ప్రేమ, బాధ, దు:ఖం, సంతోషం ఇలా ఎలాంటి భావాలనైనా పంచుకోవడంలో అబ్బాయిలకన్నా అమ్మాయిలే ముందున్నారట.

పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు ఇలా మదిలోని భావాలను బట్టి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేసే అల్గారిథమ్‌ను రూపొందించారు. ఈ అంచనా ద్వారా నిపుణులు గుర్తించిన విషయం ఏమంటే, చాలామంది అమ్మాయిలు తమ ప్రేమలో విఫలమై ఆ భావాలను ట్వీట్ల రూపంలో పంచుకుంటున్నారట. ప్రముఖులు వారి విజయాలను మాత్రమే తెలియజేస్తూ ఉనికి కోల్పోకుండా చూసుకుంటున్నారట. అయితే సాధ్యమైనంతవరకూ ట్వీట్లు చేసేటప్పుడు వ్యక్తిగత విషయాలను పంచుకోవడం, ఇతరులను విమర్శించడం సరికాదని, ఇలాంటి పద్ధతి వల్ల ఎదుటివారికి మనపై చులకన భావం ఏర్పడుతుందని, ట్వీట్లు సరదాలకు, సంతోషాలకు వేదికగా ఉపయోగించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News