: నాన్‌వెజ్‌ తింటే షుగరొస్తుందట!


కొందరు నాన్‌వెజ్‌ లేకుంటే అన్నం ముట్టకోరు. వారంలో కనీసం ఒకసారైనా నాన్‌వెజ్‌ ఉండాలని చాలామంది మాంసాహార ప్రియులు చెబుతుంటారు. ఇలా మాంసాహారంపై మక్కువ ఎక్కువగా ఉండి, దాన్ని అమితంగా ఆరగించేవారికి షుగరు వచ్చే ప్రమాదముందట. ఈ మేరకు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

పారిస్‌లోని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఎపిడిమాలజీ అండ్‌ పాపులేషన్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో మాంసాహారం ఎక్కువగా తినేవారికి, దానితోబాటు జున్ను కూడా బాగా లాగించేవారికి టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తేలింది. తమ పరిశోధనలో భాగంగా పరిశోధకులు సుమారు 60 వేలమంది మహిళలపై అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో మాంసాహారాలను వేటితో తయారుచేశారనే దానితో నిమిత్తం లేకుండా మొత్తం ఆహారంలో ఆమ్లత్వం (ఎసిడిటీ) ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. మనం తీసుకునే ఆహారంద్వారా శరీరంలో ఆమ్లరక్తత ఎక్కువయ్యేకొద్దీ ఇన్సులిన్‌ విడుదల కూడా ఎక్కువవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి మాంసాహారం మరీ ఎక్కువగా లాగించేయకుండా కాస్త మితంగా తీసుకుంటే మంచిదే!

  • Loading...

More Telugu News