: ఆంధ్రకు అడిగినవన్నీ ఇస్తే ఊరుకోము: పాల్వాయి


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నాం కదా అని ఆంధ్రకు అన్నీ ఇస్తే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో ఆయన మాట్లాడుతూ అభద్రతా భావం ప్రచారం చేసి కేంద్ర నాయకత్వాన్ని మోసం చేసేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తెలంగాణ కంటే ఆంధ్ర వెనకబడినట్టు 11 శాఖల సమాచారాన్ని తప్పుగా ఇచ్చేందుకు సచివాలయ అధికారులను కేంద్ర మంత్రులు మేనేజ్ చేశారని ఆరోపించారు. వాస్తవానికి తెలంగాణే అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురైందన్న పాల్వాయి, భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే అన్నారు.

  • Loading...

More Telugu News