: తెలంగాణ ప్రజలు ఎలాంటి తెలంగాణ కోరుతున్నారో చెప్పాం: కేసీఆర్


తెలంగాణ ప్రజలు ఎలాంటి తెలంగాణ కోరుతున్నారో జీవోఎంకు తాము వివరించామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. ఢిల్లీలో జీవోఎంతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ లోపు భారత దేశంలో తెలంగాణ 29 వ రాష్ట్రంగా ఏర్పడుతుందని అన్నారు. మిగిలిన 28 రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉంటాయో అవన్నీ తెలంగాణకు కూడా వర్తించాలని కోరామన్నారు. హైదరాబాదుపై ఎలాంటి ఆంక్షలు వద్దని జీవోఎంను కోరామని తెలిపారు. వీలైనంత తొందర్లో తెలంగాణ ఏర్పాటవుతుందని జీవోఎం తమకు చెప్పిందని కేసీఆర్ అన్నారు. డిసెంబరులో బిల్లు పార్లమెంటులోకి వస్తుందని, ఆ లోపు అన్ని రాజకీయ పార్టీల నేతలను తాము కలుస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో విలీనంపై ఆయన స్పందిస్తూ, విలీనం లేదని వార్తపత్రికలు రాశాయే తప్ప తామేమీ చెప్పలేదని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును 5 ఏళ్లు మాత్రమే ఉంచాలని తాము జీవోఎంకు తెలిపామని చెప్పారు. జీవోఎంకు రాకుండా చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకతను బయటపెట్టుకున్నాడని కేసీఆర్ విమర్శించారు. డిమాండ్ లేకుండా ఉండేంత గొప్పనాయకుడు చంద్రబాబు అని, అసలు అతనికి బ్రెయిన్ ఉందా? దొబ్బిందా? అన్నది ప్రజలే అర్థం చేసుకుంటారని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News