: బీజేపీ నేత వ్యాఖ్యలపై బీహార్ సీఎం ఆగ్రహం
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షిలేఖి వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మండిపడ్డారు. తన మానసిక స్థితి బాగోలేదంటూ వ్యాఖ్యానించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి భాష, పదజాలం బీజేపీ నేతల డొల్లతనాన్ని వెల్లడిస్తున్నాయన్నారు. తన మానసిక పరిస్థితి ఎప్పట్లానే బాగుందని చెప్పారు. నరేంద్ర మోడీపై నితీశ్ చేసిన వ్యాఖ్యలకు గానూ బీజేపీ పై వ్యాఖ్యలు చేసింది. ఇందుకుగాను బీజేపీ క్షమాపణలు చెప్పాలని అధికార జనతాదళ్ (యు) డిమాండ్ చేసింది.