: సుప్రీంకోర్టు మాజీ జడ్జిపై లైంగిక వేధింపుల కేసు.. విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు


గత ఏడాది తన తాత వయసున్న ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నుంచి లైంగిక వేధింపులకు గురయ్యానని పేర్కొంటూ, ఓ ప్రభుత్వేతర సంస్థలో పనిచేస్తున్న స్టెల్లా తన బ్లాగులో రాసింది. ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్న ఆయన జీవితకాలపు పేరు ప్రతిష్ఠలను మంటగలపడం ఇష్టంలేక తాను మౌనం దాల్చానని పేర్కొంది. తరువాత అదే విషయం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో ఆ వార్త సంచలనం సృష్టించింది.

స్టెల్లా బ్లాగులో రాసిన విషయాన్నే సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు... ఈ కేసును విచారించడానికి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను నియమించింది. ఈ ఆరోపణలను తేలిగ్గా తీసుకోలేమన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం... న్యాయవ్యవస్థలో అత్యున్నత సంస్థకు అధిపతిగా ఉన్న తాను వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News