: ముగిసిన మాజీ ఎయిర్ చీఫ్ త్యాగి విచారణ


హెలి స్కాంలో ఇరుక్కున్న మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ పీ త్యాగిపై సీబీఐ విచారణ ముగిసింది. త్యాగితో పాటు ఆయన సోదరులు కూడా సీబీఐ ఎదుట ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హాజరయ్యారు. సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు మొత్తం ఐదు గంటల పాటు వీరిని ప్రశ్నించారు.

రూ. 3600 కోట్ల కుంభకోణంలో మధ్యవర్తులు కార్లో గెరోసా, గిడో హాష్కెలతో త్యాగి, అతని సోదరులకు ఉన్న లింకులపై ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం ఫిన్ మెకానికా సంస్ఝకు దక్కేందుకు గెరోసా, హాష్కె ప్రధాన పాత్ర పోషించారని ఇటలీ దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News