: సోనియాకు గుడి నిర్మిస్తున్నా: శంకర్రావు


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గుడి నిర్మించనున్నట్లు హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు వెల్లడించారు. ఈ మేరకు నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. జీహెచ్ ఎంసీ అధికారుల అనుమతికోసం ఎదురు చూస్తున్నట్లు శంకర్రావు చెప్పారు. డిసెంబరు 9 సోనియా జన్మదినం కావడంతో ఆ రోజు గుడికి శంకుస్థాపన చేస్తామన్నారు. విభజనపై తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నా అవేమీ పట్టించుకోకుండా సోనియా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళుతున్నందువల్లే గుడి నిర్మించాలని అనుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News