: సీఎంను అడ్డుకునే దమ్ము తెరాసకు ఉందా? : జగ్గారెడ్డి


సంగారెడ్డిలో సీఎం కిరణ్ ను అడ్డుకునే దమ్ము టీఆర్ఎస్ కు ఉందా? అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. రేపు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సభ ఉండటం వల్ల... సంగారెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరారని... అందువల్ల సీఎం కార్యక్రమాన్ని వాయిదావేశామని తెలిపారు. అంతేకాని టీఆర్ఎస్, జేఏసీలకు భయపడి కాదని అన్నారు. లక్షమందితో సంగారెడ్డిలో త్వరలోనే బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. ఆ సభకు కిరణ్ హాజరవుతారని జగ్గారెడ్డి అన్నారు. గతంలో ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కేసీఆర్ బంద్ కు పిలుపునిచ్చారని... అయినప్పటికీ ఏమీ చేయలేకపోయారని... అలాంటిది ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడితే అది జరుగుతుందా? అని ప్రశ్నించారు. సీఎం పర్యటన కొనసాగి ఉంటే... మెదక్ జిల్లాకు రూ. 200 కోట్లు వచ్చుండేవని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News