: 106 ఏళ్ల వయసులో హైస్కూల్ డిప్లమా సాధించిన అమెరికా జాతీయుడు..!


చదువుకు వయసా అడ్డంకి? అంటూ ఆ అమెరికన్ పెద్దాయన 106 ఏళ్ల వెరీ లేటు వయసులో హైస్కూల్ డిప్లమా సాధించి ఔరా అనిపించాడు. బెవర్లీ ప్రాంతంలో ఉండే ఫ్రెడ్రిక్ బట్లర్ అనే శతాధిక వృద్ధుడు బాల్యంలో చదువుకోవాలన్న తపన ఉన్నా పరిస్థితులు అనుకూలించక పుస్తకాలు పట్టలేదట.

కుటుంబ పోషణ నిమిత్తం మనోడు 8వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. 1941-45 కాలంలో బట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యంలో పనిచేశాడట. ఆ తర్వాత పెళ్లి చేసుకుని వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేసి 1975లో పదవీ విరమణ చేశాడు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ చదువుకోవాలనిపించడంతో జీవితం చరమాంకంలో ఉన్నా స్కూలుకు వెళ్లడానికి బట్లర్ సిగ్గుపడలేదు.

పట్టుదలగా చదవి ఎట్టకేలకు డిప్లమా సాధించి, తన చిన్ననాటి కల నెరవేర్చుకున్నాడు. మొన్న సోమవారమే స్నేహితులు, బంధువులు, సహచర విద్యార్ధుల మధ్య డిప్లమా అందుకుంటూ మురిసిపోయాడు.

  • Loading...

More Telugu News