: ఎనిమిది పార్టీలకూ ఒకే సమావేశం పెడితే బాగుండేది : నారాయణ


ఢిల్లీ జీవోఎం అఖిలపక్ష భేటీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎనిమిది పార్టీలకూ కలిపి ఒకేసారి సమావేశం పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఒక్కొక్క పార్టీని పిలవడం వల్ల భిన్నాభిప్రాయాలు చెబుతారని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. జీవోఎంతో భేటీ ముగిసిన అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని జీవోఎంను కోరామన్నారు. అదే విధంగా సీమాంధ్రలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కూడా కోరినట్లు చెప్పారు. ఆంధ్ర, రాయలసీమల్లో అభివృద్ధి బోర్డులు ఏర్పాటుచేయాలని, నదీ జలాలపై ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయాలని జీవోఎంను కోరామని నారాయణ పేర్కొన్నారు.

సీమాంధ్రలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, విశాఖ, గన్నవరం విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలని జీవోఎం భేటీలో చెప్పామన్నారు. రాష్ట్రంలో ముంపు ప్రాంతాల్లో వెంటనే పరిహారం చెల్లించి.. పోలవరం ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని తెలిపామన్నారు. సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణాన్ని త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందానికి వివరించామని నారాయణ వెల్లడించారు.

  • Loading...

More Telugu News