: రాష్ట్ర విభజనకు మేం వ్యతిరేకం : ఒవైసీ
రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. అలాగే, హైదరాబాద్ ని యూటీ చేయడానికి కూడా ఒప్పుకోమని తేల్చి చెప్పారు. జీవోఎంతో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఒవైసీ.. విభజనపై తమ నిర్ణయాన్ని నిర్మొహమాటంగా తెలిపామని చెప్పారు. విభజనపై జీవోఎంకు 18 పేజీల నివేదిక అందించిన ఓవైసీ.. హైదరాబాదులో శాంతి భద్రతలను కేంద్రం పరిధిలోకి తేవొద్దన్నారు. విభజన తప్పనిసరైతే హైకోర్టును విభజించాలన్నారు. అలాగే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలని జీవోఎంను కోరినట్టు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు, వైఖరి విచిత్రంగా ఉందన్న ఒవైసీ... తెలంగాణ నేతలకు పదవులపై వ్యామోహం అధికంగా ఉందని ఆరోపించారు. కాగా, సీమాంధ్ర కేంద్ర మంత్రులు లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. విభజన జరిగితే ముస్లింలు, క్రీస్టియన్లకే నష్టమని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగ రక్షణ వ్యవస్థలు ఉండగా సీమాంధ్రులకు భయమెందుకని ఒవైసీ ప్రశ్నించారు. ఆంటోనీ కమిటీ, జైరాం రమేష్ లు ఎలాంటి నివేదికలు ఇవ్వలేదని జీవోఎం చెప్పిందన్నారు.