: అనంతపురంలోని సుజుకీ షోరూంలో అగ్ని ప్రమాదం
అనంతపురంలోని ఆర్ఎఫ్ రోడ్డులో ఉన్న సుజుకీ షోరూంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.