: అధిష్ఠానం నిర్ణయానికే ఓటు వేస్తా : పనబాక
శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తానని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. తాను సమైక్యవాదినైనా అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి ఆంటోనీ కమిటీ నివేదించిన అంశాలను... బిల్లులో పొందుపరచాలని అధిష్ఠానాన్ని కోరతానని చెప్పారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రను సింగపూర్ లా డెవలప్ చేస్తామని పనబాక తెలిపారు. హైదరాబాద్ ను యూటీ చేయాలని, ఈ నెల 18న సీమాంధ్ర కేంద్ర మంత్రులందరూ కలసి జీవోఎంను కోరతామని చెప్పారు. విజయవాడ-గుంటూరు మధ్య... తూర్పు మధ్య కోస్తా రైల్వే జోన్ ను ఏర్పాటు చేయాలని కోరతామని అన్నారు. అలాగే, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల కోస్తా రైల్వే లైన్ ను నిర్మించాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. కేసీఆర్ అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని పనబాక చెప్పారు.