: గుండెపోటుకు కొత్త చికిత్స


గుండెపోటు వచ్చే రోగులకు కొత్త రకం చికిత్సను పరిశోధకులు అభివృద్ధి చేశారు. మన గుండెలోనే ఉన్న ఒక ప్రోటీన్‌ను నియంత్రణ చేయడం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత దాన్ని నివారించడానికి తగు వైద్యం చేయడంకన్నా కూడా రాకముందే ముందుజాగ్రత్తలు తీసుకుంటే ముప్పు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

అమెరికాకు చెందిన పరిశోధకులు ఒక ప్రోటీన్‌ను నియంత్రించడం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చని, దీనిద్వారా గుండెలోని కణజాలం దెబ్బతినకుండా చూడవచ్చనే విషయాన్ని తమ పరిశోధనలో కనుగొన్నారు. గుండెలో ఉండే టీఎన్‌ఎన్‌13కే అనే ప్రోటీన్‌ను నియంత్రించడం ద్వారా ముప్పును తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ ప్రోటీన్‌ కేవలం గుండెలోనే ఉంటుందని, అయితే దీని పని ఏమిటి? అనేది స్పష్టంగా తెలియకపోయినా గుండెపోటు వచ్చిన సమయాల్లో ఈ ప్రోటీన్‌లో వచ్చే మార్పుల వల్ల ఆ మార్పులు గుండెలోని ఇతర ప్రోటీన్లను కూడా ప్రభావితం చేస్తాయని తేలింది. ఫలితంగా గుండెకు సంబంధించిన ఇతర కణజాలం కూడా దెబ్బతింటుందని, అలాకాకుండా దీన్ని నియంత్రించడం వల్ల గుండెపోటు వచ్చే ముప్పును తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News