: గర్భిణులు వ్యాయామం చేస్తే పిల్లలకు మంచిది


గర్భంతో ఉన్న సమయంలో ఎక్కువగా పనులు చేయవద్దని ఇంట్లో చాలామంది చెబుతుంటారు. కొందరినైతే అసలు కదలకుండా కూర్చోబెడతారు కూడా. కానీ ఇది మంచి పద్ధతి కాదట. గర్భంతో ఉన్నవారు చక్కగా తేలిక పాటి వ్యాయామాలు చేయడం వల్ల దాని ప్రభావం వారి కడుపులో ఉన్న బిడ్డ మెదడు ఎదుగుదలకు ఎంతగానో ఉపకరిస్తుందట.

మాంట్రియెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గర్భంతో ఉన్నవారు చేసే వ్యాయామం వారి బిడ్డల బరువు పెరుగుదలకు కూడా బాగా ఉపకరిస్తుందని చెబుతున్నారు. వీరు మూడు నెలల గర్భంతో ఉన్న మహిళలను రెండు గ్రూపులుగా విభజించారు. వారిలో ఒకరిని ఊరికే కూర్చుని ఉండేలా చేశారు. మరొక గ్రూపును సైకిల్‌ తొక్కడం, నడవడం వంటివి వారంలో మూడుసార్లు చేసేలా వారికి సూచనలిచ్చారు. వీరికి ప్రసవానంతరం పన్నెండు రోజుల తర్వాత బిడ్డల చర్యలను పరిశీలించారు.

ఈ పరిశోధనలో ఎలాంటి వ్యాయామం చేయని తల్లులకు పుట్టిన పిల్లలు ఎక్కువగా నిద్రపోవడం, ఎలాంటి ఉత్సాహం లేకుండా ఉండగా, వ్యాయామం చేసిన తల్లులకు పుట్టిన పిల్లలు ధ్వనులను గుర్తించడం, పాత శబ్దాలకు, కొత్త శబ్దాలకు మధ్య తేడాలను తేలికగా గుర్తించడం వంటివి చేసినట్టు ఈ పరిశోధనలో తేలింది. కాబట్టి గర్భవతులు చిన్నపాటి వ్యాయామాలను చేయడం వల్ల పుట్టబోయే బిడ్డల తెలివితేటల పెరుగుదలకు కూడా మంచిదే.

  • Loading...

More Telugu News