: భారత క్రికెట్ జట్టుతో ఆడటం మరచిపోలేని అనుభూతి: సచిన్
సచిన్ టెండూల్కర్ ను ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ టీమిండియాకు, అబిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. భారత క్రికెట్ జట్టుతో ఆడటం మరచిపోలేని అనుభూతని అన్నాడు. క్రికెట్ తో తనది 29 ఏళ్ల అనుబంధమన్నాడు. తన ప్రాక్టీస్ కు అవసరమైన సౌకర్యాలను ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కల్పించిందని చెప్పాడు. కాగా ఎంసీఏ ఈ రోజు అధికారికంగా కాందివిలి మైదానానికి 'సచిన్ టెండుల్కర్ జింఖానా క్లబ్' అని పేరు పెట్టింది. సన్మాన కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే తదితరులు హాజరయ్యారు. సచిన్ భార్య అంజలి కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది.