: ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులను కేంద్రం నేడు ప్రకటించింది. విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తులుగా, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వ్యక్తులుగా పరిగణిస్తూ బీజేపీ ఎంపీ అరుణ్ జైట్లీ (2010), కాంగ్రెస్ కు చెందిన కరణ్ సింగ్ (2011), జేడీయూ నేత శరద్ యాదవ్ (2012)లను ఉత్తమ పార్లమెంటేరియన్లుగా ఎంపిక చేశారు.