: తమ్ముడి హత్య కేసులో జడ్చర్ల ఎమ్మెల్యేకు బెయిల్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కు బెయిల్ లభించింది. జిల్లా మొదటి అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేశారు. కొన్ని నెలల కిందట తమ్ముడు హత్య కేసులో పరారైన ఎర్ర శేఖర్ కొన్ని రోజుల తర్వాత మహబూబ్ నగర్ పోలీసులకు స్వయంగా లొంగిపోయాడు.