: కాంగ్రెస్ లో చేరమని ఆహ్వానించారు: ఎర్రబెల్లి
టీడీపీ మేధోమథనం సదస్సులో ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ లో చేరమంటూ తనకు ఆహ్వానం వచ్చిందనీ, అయితే తాను టీడీపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీని వీడాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేసుకుంటానని అన్నారు. పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న సదస్సుకి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.