: విశాలాంధ్ర ప్రతినిధులపై దాడిని ఖండిస్తున్నాం: గాలి ముద్దుకృష్ణమ
ఢిల్లీలో విశాలాంధ్ర ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలుగువాడి పౌరుషంతో ఆడుకుంటే సోనియా ఇంటిపై దాడికి కూడా ప్రజలు వెనుకాడరని హెచ్చరించారు. రచ్చబండ ప్రచారానికి వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం రచ్చబండలో ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.