: విషపు నీరు త్రాగి 20 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు అస్వస్థత
నిజామాబాద్ జిల్లాలోని బీర్కూర్ మండలం బరంగిడి ప్రాధమిక పాఠశాల ట్యాంకులో గుర్తు తెలియిన వ్యక్తులు విషగుళికలు కలిపారు. విషయం తెలియని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ నీరు సేవించారు. దీంతో 20 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరికి బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.