: భవిష్యత్తులో 8 శాతం వృద్ధి సాధ్యమే: ప్రధాని
సమీప భవిష్యత్తులో భారత్ 8 శాతం వృద్ధి రేటును అందుకుంటుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ ఆర్ధిక వృద్ధి రేటులో సమతుల్యత లోపించిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఖాతాల ద్రవ్యలోటు తాము అనుకున్న దానికంటే అధికంగానే ఉందని ప్రధాని చెప్పారు. కాగా, ఆర్ధిక వృద్ధి పెంచేందుకు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు. ఇక శ్రీలంక దళాల అదుపులో ఉన్న భారత జాలర్లను విడిపించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.