: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేసిన వసుంధరా రాజే
కొన్ని రోజుల్లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ వసుంధరా రాజే నామినేషన్ దాఖలు చేశారు. జహల్ వార్ జిల్లా జహల్రపటాన్ నియోజక వర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాజే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుకోసం ఓటు వేయాలని ప్రజలను కోరారు. తప్పకుండా తాము గెలుస్తామని, నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజస్థాన్, ఢిల్లీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.