: ఆమ్ ఆద్మీ పార్టీ నిధులపై ప్రభుత్వ విచారణ
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన విరాళాలపై వస్తున్న పలు ఊహాగానాల నేపథ్యంలో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పలువురు ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం విచారణ జరుపుతోందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. అటు హోంమంత్రి మాటలపై స్పందించిన పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. విచారణ జరుపుకోవచ్చన్నారు. అందుకు తాము సిద్ధమేనని తెలిపారు. అదే చేత్తో కాంగ్రెస్, బీజేపీలకు అందుతున్న నిధులపైన కూడా విచారణ జరిపించమని కోరారు. కాంగ్రెస్ కి రెండువేల కోట్ల రూపాయలు విరాళాలు అందాయని, వాటి మీద కూడా షిండే విచారణ జరిపిస్తున్నారా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.