: బాలీవుడ్ హీరో గోవిందాపై కేసు కొట్టివేత
బాలీవుడ్ హీరో గోవిందాకు బాంబే హైకోర్టులో ఉపశమనం లభించింది. గోవిందాపై ఐదేళ్ల క్రితం దాఖలైన కేసును న్యాయస్థానం ఈ రోజు కొట్టివేసింది. 2008లో గోవిందా తనను చెంప దెబ్బ కొట్టారని బాలీవుడ్ వెటరన్ సంతోష్ రాయ్ కేసు పెట్టారు. రాయ్ మొదట ముంబై మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు దాఖలు చేశారు. అయితే తనపై విచారణ జరుగకుండా కేసు కొట్టేయాలని గోవిందా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సుదీర్ఘ కాలంపాటు సాగింది. గోవిందాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో తాజాగా కేసును కొట్టేశారు.