: విభజన సీమాంధ్రులకు బాధ కలిగిస్తోంది: మర్రి శశిధర్ రెడ్డి
రాష్ట్ర విభజన సీమాంధ్రులకు బాధ కలిగిస్తోందని జాతీయ విపత్తు నివారణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతల రెచ్చగొట్టే మాటలతో సీమాంధ్ర ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. జీవోఎం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. తమ ప్రాంత నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తెలంగాణలో కానీ, హైదరాబాద్ లో కానీ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని అన్నారు. జీవోఎం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.