: ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్
ఛత్తీస్ గఢ్ లో పోలింగ్ పలు ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు చోట్ల బాంబు దాడులకు యత్నించారు. దాంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు ధనికార్కాలో రెండు టిఫిన్ బాక్సు బాంబులను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. దంతెవాడ జిల్లాలోని మంగనగర్, సత్ ధర్ లలోనూ పోలీసులు ఆరు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక సుకుమ, కాంకేర్, దంతెవాడ, నారాయణపూర్ లలో మొత్తం 15 నుంచి 20 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్ గఢ్ డీజీపీ తెలిపారు.