: హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఒప్పుకుంటున్నాం: జైపాల్ రెడ్డి
హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఒప్పుకుంటున్నామని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ భద్రాచలం తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. తెలంగాణలోని మిగతా పార్టీలతో మా విధానం ఒకేలా ఉంటుందని అన్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధానికి తాము ఒప్పుకుంటున్నామని, అంతకు మించి భారాన్ని భరించడానికి సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు.