: 2014 లోపే తెలంగాణ ఏర్పాటు: షిండే
శీతాకాల సమావేశాలతో ఈ ఏడాది పూర్తవుతుందని, అంతకంటే ముందే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు త్వరలోనే కేబినెట్ ముందుకు వస్తుందని మంత్రి తెలిపారు. ఢిల్లీలో శాంతి భద్రతలపై హోం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శ్రీకృష్ణ కమిటీ పలు సూచనలు చేసిందని వాటిని పరిగణనలోకి తీసుకుంటూ అక్కడి నేతల అభిప్రాయాలు కూడా లెక్కలోకి తీసుకుంటున్నామని అన్నారు. రాజధానిపై పలు సూచనలు వస్తున్నాయని, అఖిలపక్షం సమావేశానికి పార్టీలను ఆహ్వానించామని జీవోఎం దీనిపై సూచనలు చేస్తుందని ఆయన అన్నారు. జీవోఎం ఎంత త్వరగా నివేదిక ఇస్తే అంత త్వరగా ఏర్పాటు పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు.