: ప్రధాని సీమాంధ్రులకు న్యాయం చేస్తామన్నారు: పురంధేశ్వరి


సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ భరోసా ఇచ్చారని కేంద్ర మంత్రి పురంధేశ్వరి తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, తామిప్పటికే జీవోఎంలో ఉన్న అందరు మంత్రులను వ్యక్తిగతంగా కలిశామని, సీమాంధ్ర ప్రజల మనోభావాలు తెలిపామని అన్నారు. విభజన సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే వారికి న్యాయం జరుగుతుందో ప్రధానికి వివరించామని ఆమె వెల్లడించారు. సీమాంధ్ర ప్రజలకు అనుమానాలు ఉన్న నీరు, హైదరాబాద్, ఉద్యోగాలపై తమ అభిప్రాయాలు స్పష్టం చేసినట్టు ఆమె తెలిపారు. తాము గతంలో జీవోఎంకు ఇచ్చినట్టే 11 అంశాలపై ప్రధానికి నివేదిక ఇచ్చామన్నారు. దీనిపై ప్రధాని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఇస్తామని తెలిపారన్నారు. ఎవరికీ అన్యాయం జరుగకుండా అందరికీ న్యాయం చేస్తామని ప్రధాని చెప్పడంతో తమకూ నమ్మకం కుదిరిందని పురంధేశ్వరి అన్నారు.

  • Loading...

More Telugu News