: తమిళనాడు ట్రేడర్స్ అసోసియేషన్ నిరసన బంద్


కోలంబోలో ఈ నెల 15న జరగనున్న కామన్ వెల్త్ సమావేశాలకు భారత్ హాజరుకావడంపై 'తమిళనాడు ట్రేడర్స్ అసోసియేషన్' ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చింది. దాంతో, స్థానిక వాణిజ్య సముదాయాలన్నింటినీ మూసివేశారు. దాదాపు 4,500 చిన్న, పెద్ద అమ్మకందారులు ఈ బంద్ లో పాల్గొని తమ మద్దతును తెలిపారు. ఈ సమావేశాలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాజరు కాకూడదంటూ తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయన విరమించుకున్నారు. దాంతో, భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరవుతున్నారు.

  • Loading...

More Telugu News