: కేసీఆర్ ను కలిసిన టీజేఏసీ నేతలు


టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావుతో టీ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను జీవోఎం ముందు వినిపించాలని కేసీఆర్ కు తెలియజేశామని టీజేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తప్ప ఏ ప్రతిపాదనను అంగీకరించమని స్పష్టం చేశారు. అయితే, తమకు అవకాశం వస్తే జీవోఎంను కలుస్తామని టీజేఏసీ నేతలు అన్నారు. కాగా, కేసీఆర్ తో పాటు కోదండరాం కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News