: ప్రధానితో ముగిసిన సీమాంధ్ర మంత్రుల భేటీ
ప్రధాని మన్మోహన్ సింగ్ తో సీమాంధ్ర ప్రాంతానికి చెదిన కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, పురంధేశ్వరి, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, పనబాక లక్ష్మిల భేటీ ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని ప్రధానిని కోరారు. జీవోఎంకు కేంద్ర మంత్రులు సమర్పించిన 6 పేజీల నివేదికను ప్రధానికి అందజేశారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా కానీ, ఢిల్లీ తరహాలో ప్రత్యేక హోదాను కాని కల్పించాలని కోరినట్టు సమాచారం.