: తెలంగాణ నుంచి భద్రాచలాన్ని వేరు చేయడం కుదరదు: ఎంపీ గుత్తా


విభజన నేపథ్యంలో భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలంటూ సీమాంధ్రులు చేస్తున్న డిమాండ్ ను తెలంగాణ నేతలు కొట్టిపారేస్తున్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, దానిని వేరు చేయడం కుదరదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణనే తాము అంగీకరిస్తామన్నారు. హైదరాబాదుకు సంబంధించి అధికారాలు గవర్నర్ కు కట్టబెడితే అభ్యంతరం తెలుపుతామని గుత్తా పేర్కొన్నారు. ఆంటోనీ కమిటీ, టాస్క్ ఫోర్స్ నివేదికలపై చర్చిస్తామన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులను ఎవరూ హరించలేరన్న ఎంపీ, ప్రాథమిక హక్కుల రక్షణకు మనకు న్యాయ స్థానాలు ఉన్నాయన్నారు.

  • Loading...

More Telugu News