: నేడు కర్నూలు జిల్లా బంద్
విభజనను నిరసిస్తూ నిన్న (ఆదివారం) ఢిల్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిన విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలపై దాడికి నిరసనగా నేడు కర్నూలు జిల్లాలో బంద్ జరుగుతోంది. దాడికి నిరసనగా విద్యా, వ్యాపార సంస్థలను మూసివేసి బంద్ పాటిస్తున్నారు. స్థానిక రాజీవ్ నగర్ కూడలిలో సమైక్యవాదులు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన జేఏసీ నేతలు మానవహారం చేపట్టి, ర్యాలీ నిర్వహిస్తున్నారు. దాంతో, ట్రాఫిక్ నిలిచిపోయింది.