: కేంద్ర అధికారులతో షిండే, ఆజాద్, జైరాం రమేష్ సమావేశం
కేంద్రానికి చెందిన పలు శాఖల అధికారులతో, నార్త్ బ్లాక్ లోని హోంమంత్రి కార్యాలయంలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, వైద్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ సమావేశమయ్యారు. విద్య, వైద్యం, ఆరోగ్య అంశాలపై అధికారులతో ఆజాద్ చర్చిస్తుండగా, అటు జలవనరుల శాఖ అధికారుల నుంచి నీటి వనరుల పంపిణీపై జైరాం వివరాలు తీసుకుంటున్నారు. కాగా, విభజనపై కేంద్ర బృందంతో విస్తృతంగా చర్చిస్తున్నారు.