: ఛత్తీస్ గఢ్ లో తొలి విడత పోలింగ్ ప్రారంభం


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్ గఢ్ లో తొలి విడత పోలింగ్ ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బస్తర్, రాజనందగావ్ లలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మావోయిస్టులు దాడులకు తెగబడే అవకాశమున్న నేపథ్యంలో భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News